
రోడ్డు ప్రమాదంలో జింక మృతి
రాయచోటి : రామాపురం మండలం పాలనగారిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జింక మృతిచెందింది. శుక్రవారం ఉదయం రాయచోటి నుంచి ద్విచక్ర వాహనంలో కొంద రు కడపకు వెళ్తున్నారు. పాలన్నగారిపల్లి సమీపంలో చెట్లపొందల నుంచి జింక రోడ్డుమీదకు రావడంతో ఢీకొన్నారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు గాయాలపాల య్యారు. గాయపడిన జింక కూడా మృతి చెందినట్లు అటవీబీట్ అధికారి భరణీధర్ తెలిపారు.
వృద్ధురాలికి ఆశ్రయం
మదనపల్లె రూరల్ : రోడ్డుపై ఉన్న వృద్ధురాలిని పోలీసులు అనాథ ఆశ్రమానికి చేర్చి దాతృత్వం చాటారు. పట్టణంలోని సీటీఎం రోడ్డు ఎస్టేట్‌లో సుమారు 65 ఏళ్ల వయస్సు కలిగిన వృద్ధురాలు రోడ్డు పక్కన దిక్కుతోచని స్థితిలో ఉంది. స్థానికులు వివరాలు ఆరాతీయగా తన పేరు జయమ్మ, ప్యారంపల్లె గ్రామమని, తనకు నలుగురు కుమార్తెలున్నారని తెలిపారు. తనను పోషించలేక ఎస్టేట్‌లో వదిలి వెళ్లినట్లు తెలిపింది. స్థానికులు 112 కు కాల్‌చేసి సమాచారం అందిస్తే టూటౌన్ ఏఎస్‌ఐ వై.వి.రమణ ఘటనాస్థలానికి వెళ్లి వృద్ధురాలిని ఆనంద వృద్ధాశ్రమంలో చేర్చారు. జయమ్మ సంబంధీకుల ఆచూకీ తెలిసేంతవరకూ ఆశ్రమంలో ఉంచుకుని ఆలనాపాలన చూడాల్సిందిగా కోరారు. వృద్ధురాలికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే..9133006333, 9441169202, 9182276316 ఫోన్ నెంబర్లలో సంప్రదించాల్సిందిగా సూచించారు.
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని అంకిశెట్టిపల్లెకు చెందిన కుమార్‌రెడ్డి కుమారుడు లోకేష్‌రెడ్డి(23)ని తల్లిదండ్రులు మందలించారని పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అదే విధంగా పోతబోలుకు చెందిన సాగర్‌రెడ్డి భార్య కృష్ణవేణి(27) అనారోగ్య కారణాలతో మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పట్టణంలోని వీవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న రెడ్డెప్ప భార్య ఎం.రాణి(32) రుణదాతల నుంచి ఒత్తిడి అధికం కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆయా ఘటనల్లో బాధితులను కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో జింక మృతి