
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం
రాయచోటి టౌన్ : సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మీనరసయ్య తెలిపారు. రాయచోటి ఎన్‌జీవో హోంలో మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే ఆశా వర్కర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశావర్కర్లకు ఇచ్చిన లక్ష్యాలను అధిగమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలన్నారు. జిల్లా మానిటరింగ్ అధికారి రియాజ్ బేగ్ మాట్లాడుతూ ఆరోగ్యశాఖలో పని చేసే ఉన్నత స్థాయి అధికారులు గ్రామీణ ప్రాంతంలోని ఆశావర్కర్లు, ఇతర ఆరోగ్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఇచ్చిన లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నవీన్, వసీం అక్రమ్, అబ్దుల్ లతీఫ్, వజ్ర అమ్రీన్, విష్ణువర్థన్‌రెడ్డి, మలేరియా సబ్ యూనిట్ అధికారి జమరామయ్య, సూపర్‌వైజర్ నూర్జాహాన్, ఆరోగ్యకార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆధునిక పద్ధతులతో
అధిక దిగుబడి
నందలూరు : రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చని అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గుణశేఖర్‌పిళ్‌లై పేర్కొన్నారు. ఈ నెల 7 నుంచి 14 వరకు జరిగే పశుగ్రాస వారోత్సవాల్లో భాగంగా నందలూరు మండలం పాటూరు గ్రామంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులకు పశుగ్రాసం పెంపుదల, పశుగ్రాసాల్లో బహు వార్షికాల గడ్డి, వాటి ప్రాముఖ్యత, మెలకువలపై వివ రించారు. కార్యక్రమంలో రాజంపేట ఉపసంచాలకులు విజయభాస్కర్‌రావు, రాజంపేట సహా య సంచాలకులు ప్రతాప్, లోకేష్, నందలూరు పశువైద్యులు ఈశ్వర్‌ప్రసాద్, మాధవీలత, జేవీఓలు సుగుణ, గంగులయ్య, వీఏ సుదర్శన్‌రెడ్డి, ఏహెచ్‌ఏలు జాహ్నవి, శ్రీనాథ్, సుస్మిత, శివరాం, గులాబ్‌జాన్ తదితరులు పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం