
మధ్యంతర భృతి ప్రకటించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు 2023 జులై నుంచి 12వ పీఆర్‌సీ అమలు కావాల్సి ఉండగా ఆలస్యమైనందున వెంటనే మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి, మధుసూదన్ కోరారు. రాయచోటి పట్టణంలోని విజ్ఞాన్ హైస్కూల్‌లో ఎస్టీయూ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు మధ్యంతర భృతి కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుబ్రమణ్యంరాజు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, కడియాల మురళి, రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి, జిల్లా ఆర్థిక కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు రవీంద్రారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహులు, భాస్కర్‌రెడ్డి, మున్వర్‌బాషా, గోపీకృష్ణ, మోహన్, గురుమూర్తి, మురళి మనోహర్, సునీర్, జనార్దనరెడ్డి, అమరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.