
తల్లిదండ్రులకు శ్వేతశ్రీ అప్పగింత
మదనపల్లె : చదవలేకపోతున్నానని, ఫీజు విషయంలో అమానపడినట్టు లేఖ రాసి చచ్చిపోతానంటూ ఇంటినుంచి అదృశ్యమైన మూడో సంవత్సరం డీఫార్మసీ విద్యార్థిని శ్వేతశ్రీ చంద్రను ఆదివారం మదనపల్లె రూరల్ సీఐ కళావెంకటరమణ, ఎస్‌ఐ గాయత్రిలు తల్లిదండ్రులు సూర్యనారాయణ, సుజాతలకు అప్పగించారు. శుక్రవారం అత్మహత్య లేఖరాసి వెళ్లిన పోయిన శ్వేతశ్రీ చంద్ర ఆదృశ్యంపై తండ్రి మదనపల్లె రూరల్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో ఆచూకీ కొనుగొన్నారు. తిరుమలలో ఉన్నట్టు గుర్తించి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆదివారం సీఐ మీడియాతో మాట్లాడుతూ శ్వేతశ్రీ చంద్ర అదృశ్యం వెనుక సరిగ్గా చదవకపోవడం, కళాశాలలో జరిగిన అవమానం తదితర కారణాలు ఉన్నట్టు వివరించారు. తహసీల్దార్ ఎదుట హజరుపర్చి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నట్టు తెలిపారు.