
వైభవంగా తాళ్లపాక బ్రహ్మోత్సవాలు
రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో శివ,కేశవుల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున అన్నమాచార్యుడు ఆరాధించి, పూజించిన శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయాల్లో ఘనంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌరీశంకర్, తాళ్లపాక ఆలయాల ఇన్‌స్పెక్టర్ బాలాజీ, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.
శివ, కేశవుల వాహనసేవలివే..
బ్రహ్మోత్సవాల తొలిరోజున శ్రీ సిద్దేశ్వరస్వామి హంసవాహనంపై, శ్రీ చెన్నకేశవస్వామి శేషవాహనంపై విహరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈఓ ప్రశాంతి పర్యవేక్షణలో తాళ్లపాక, నందలూరులో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.