
దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన వీరుడు అల్లూరి
రాయచోటి : దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి అన్నారు. స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి అదనపు ఎస్పీ శుక్రవారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కొని గిరిజనులకు సీతారామరాజు అండగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్.కృష్ణమోహన్, ఏఆర్ డీఎస్పీ ఎం.శ్రీనివాసులు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శంకరమల్లయ్య, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఎం.తులసీరాం, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు విజె.రామకష్ణ, టి.జాన్, జోసఫ్, ఎం.పెద్దయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్వరాజ్య సంగ్రామంలో అల్లూరి మహోజ్వల శక్తి
రాయచోటి : స్వరాజ్య సంగ్రామ చరిత్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని, ఆయన దేశభక్తి, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని డీఆర్‌ఓ మధుసూదన్‌రావు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సీతారామరాజు చిత్రపటానికి డీఆర్‌ఓ శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి స్వాతంత్య్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ సీఈఓ సాయి గ్రేస్‌లీ, మేనేజర్ వివి.సుబ్బరాయుడు, డీఈఓ సుబ్రహ్మణ్యం, ఏపీ టూరిజం అధికారి నాగభూషణం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా అదనపు ఎస్పీ

దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన వీరుడు అల్లూరి