
7325
సాక్షి, రాయచోటి: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పునర్వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా ఇటీవల ప్రైవేటు టెలికాం సంస్థలు టారిఫ్ రేట్లను అధిక మొత్తంలో పెంచడంతో వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు చూసేలా చేసింది. గతంలో ఎన్నడూ లేని తరహాలో బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రైవేటు టెలికాం సంస్థలకు దీటుగా 4జీ సేవలను కూడా ఒక వైపు విస్తరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో సైతం అద్భుతమైన సేవలు అందించేలా 4జీతోపాటు 5జీ సేవలు అందించేందుకు కూడా సన్నాహాలు మొదలు పెట్టనున్నారు.
పెరుగుతున్న వినియోగదారులు
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో సుమారు 1,15,000 వరకు బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు ఉన్నారు. ల్యాండ్‌ఫోన్లు, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులతో పాటు 12 వేలకు పైగా ఫైబర్ కనెక్షన్లు కూడా వస్తున్నాయి. ప్రైవేటుకు దీటుగా ఇంటర్నెట్‌తోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తూ వినియోగదారులను సంస్థ ఆకర్షిస్తోంది. దీంతో ఇతర కంపెనీలకు చెందిన వారు కూడా చిన్నగా ఇటు వైపు మారుతున్నారు. ఒక్క జులై నెలలోనే కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌లు తీసుకునేందుకు సుమారు ఐదు వేల దరఖాస్తులు వచ్చాయి. సాధారణంగా నెలకు 1500 కనెక్షన్లు మాత్రమే సరాసరిన వచ్చే పరిస్థితి నుంచి అదనంగా 3500 ఇతర జియో, ఎయిర్‌టెల్, ఐడియా కంపెనీల నుంచి వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్
వినియోగదారులు:
జిల్లాలో 4జీ సేవలు
అన్నమయ్య జిల్లాలో ఇప్పటికే రాజంపేట, రాయచోటి ప్రాంతంలో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు విస్తరించింది. రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరులలో సుమారు 180 వరకు టవర్లు ఉండగా, కొత్తగా మదనపల్లె డివిజన్‌లో 40 స్థలాలను ఎంపిక చేసి 12 శ్యాచురేషన్ 4జీ టవర్లను అందుబాటులోకి తెచ్చారు. అలాగే రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లో కూడా 17 టవర్ల ద్వారా 4జీ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న టవర్లకు సంబంధించి కూడా సెప్టెంబరు నాటికి పనులు పూర్తి చేసి పూర్తిస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో సైతం 4జీ సేవలు అందేలా చర్య లు చేపడుతున్నారు. 2025 నాటికి 5జీ సేవలు కూడా అందుబాటు లోకి తేవాలన్న లక్ష్య ంతో అడు గులు వేగంగా పడుతున్నాయి.
6315
1,15,000
జిల్లాలో 4జీ సేవలను విస్తరిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్
తొలుత రాజంపేట, రాయచోటి పట్టణాల్లో ప్రారంభించేలా చర్యలు
సెప్టెంబరు నాటికి 75 శాతం 4జీ సేవలు అందుబాటులోకి తెచ్చేలా కసరత్తు
ఇటీవల టారిఫ్‌ను భారీగా పెంచిన ప్రైవేటు సంస్థలు
దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ వైపు అడుగులేస్తున్న వినియోగదారులు
పడిలేచిన కెరటంలా పరుగెడుతున్న ప్రభుత్వ రంగ సంస్థ
ఒకప్పుడు టెలికాం రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగులీని.. ఆ తర్వాతి కాలంలో కళా విహీనంగా మారిన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడిప్పుడు తన నెట్‌వర్క్ సేవల్ని విస్తరిస్తోంది. ఇప్పటికే 4జీ నెట్‌వర్క్ సేవలను కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన టెలికాం సంస్థ తాజాగా తన 5జీ సేవల ట్రయల్స్‌ను ప్రారంభించింది. మరోవైపు ప్రైవేటు రంగ టెలికాం సంస్థల్లో ఆధిపత్య ధోరణులు, పెరిగిన టారిఫ్ తదితర కారణాలతో ఎక్కువ మంది యూజర్ల చూపు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మరలుతోంది.
190
జిల్లాలో ఉన్న
బీఎస్‌ఎన్‌ఎల్
టవర్లు:
70
జియో రూ.299 రూ.349 రూ.399 రూ.3599
ఎయిర్‌టెల్ రూ.299 రూ.349 రూ.399 రూ.3599
వొడా రూ.299 రూ.349 – –
(3జీబీ/డే)
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.187 రూ.347 – రూ.2,399
(54రోజులు)

7325

7325

7325

7325

7325

7325

7325