ముగిసిన తెప్పోత్సవాలు | Sakshi
Sakshi News home page

ముగిసిన తెప్పోత్సవాలు

Published Fri, May 24 2024 11:30 AM

ముగిస

కడప కల్చరల్‌ : పగలంతా స్వామికి ఉపచారాలు చేసి అలిసిపోయిన అమ్మవారలు సేద తీరేందుకు మళ్లీ ఆయన చెంతకే చేరారు. స్వామి వారిద్దరినీ ఆనందింపజేసేందుకు తన కోవెల పుష్కరిణికి చేరారు. ధగదగలాడే అలంకారంతో ఉన్న తెప్ప పై అల్లనల్లన విహరిస్తూ చల్లని నీటిలో ఆనంద పరవశులై సాగారు. దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ తెప్పోత్సవాలలో భాగంగా మూడవరోజు గురువారం ముగింపు సందర్బంగా స్వామి, అమ్మవార్లు తెప్పపై విహరించారు. ఆ లయ ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెప్ప పై కొలువుదీర్చి మూడుమార్లు వేద పండితుల మంత్రోచ్ఛాటనలు, రెండుసార్లు మంగళ వాయిద్యాల సుస్వరాలు, మరో రెండుసార్లు అన్నమా చార్య కీర్తనల మధ్య తెప్పోత్సవం నిర్వహించారు.

విభిన్న ప్రతిభావంతుల గుర్తింపు సర్వే

రాయచోటి టౌన్‌: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న విభిన్న ప్రతిభావంతులను గుర్తించి బడి బయటి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్చేందుకు డీఈఓ శివప్రకాష్‌రెడ్డి తల్లిదండ్రులకు సలహాలు అందించారు. గురువారం రాయచోటి పట్టణ పరిధిలో ఉన్న విభిన్న ప్రతిభావంతుల నమోదు కార్యక్రమాన్ని డీఈఓతో పాటు సమ్మిళిత విద్యా సమన్వయకర్త కె.జనార్దన్‌ పరిశీలించారు. 1 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న విభిన్న ప్రతిభావంతుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చేర్చితే వారికి ప్రభుత్వం నుంచి 21 రకాల ప్రత్యేక అవసరాలను కల్పించి వారికి సమగ్ర శిక్షణ కల్పించి ఉపకరణాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్‌పీలు జనార్దన్‌, త్రిలోక్‌, జమాలుల్లా తదితరులు పాల్గొన్నారు.

బీసీజీ టీకాతో టీబీ వ్యాధికి చెక్‌

రాయచోటి అర్బన్‌: బీసీజీ టీకాలతో దేశంలో టీబీ వ్యాధికి చెక్‌ పెట్టవచ్చని అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్‌ పర్యవేక్షణాధికారి (డీపీఎంఓ) డాక్టర్‌ రియాజ్‌బేగ్‌ అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని వాల్మీకివీధి యూపీహెచ్‌సీ పరిధిలో మాసాపేట రెడ్డివారిపల్లెలో నిర్వహిస్తున్న వయోజన బీసీజీ టీకా కార్యక్రమాన్ని ఆయన డీఎన్‌ఎంఓ డాక్టర్‌ విష్ణువర్దన్‌రెడ్డితో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో టీబీ రాకుండా ముందస్తు నివారణ చర్యలలో భాగంగా ప్రభుత్వం వయోజన బీసీజీ టీకాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. టీబీ మరణాల తీవ్రతను నివారించడంలో ఈ టీకా చాలా సురక్షితమైందన్నారు. కార్యక్రమంలో వాల్మీకివీధి పట్టణ ఆరోగ్య కేంద్రం, వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

తిరునాలలో మెరిసిన

కిరణ్‌ అబ్బవరం

సంబేపల్లె: మండల పరిధిలోని శెట్టిపల్లె పంచాయతీలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాల గురువారంతో ముగిసింది. స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ,అర్చనలు గావించారు. ఈ క్రమంలో సినీ నటుడు అబ్బవరం కిరణ్‌ స్వామి వారికి చాందినీ బండిని కట్టి మొక్కు తీర్చుకున్నారు. అంతేకాకుండా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో తిరునాల కొత్త శోభను సంతరించుకుంది.

ముగిసిన తెప్పోత్సవాలు
1/2

ముగిసిన తెప్పోత్సవాలు

ముగిసిన తెప్పోత్సవాలు
2/2

ముగిసిన తెప్పోత్సవాలు

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement