పోలీసుల ఓవర్ యాక్షన్..  వ్యభిచార గృహంలో పేక ముక్కలు ఆడిస్తూ బెదిరింపులు

Vuyyuru Rural Police Over action At prostitution House Video Viral - Sakshi

సాక్షి, కృష్ణాజిల్లా : ఉయ్యూరు పోలీసుల ఓవర్ యాక్షన్ చూపించారు. ఆకునూరులో వ్యభిచారం నడుపుతున్నట్టు సమాచారం రావడంతో ఉయ్యూరు రూరల్ పోలీసులు పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు ఒక విటుడిని, ముగ్గురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వ్యభిచార గృహంలో దర్జాగా కూర్చోని చేత్తో పేక ముక్కలు ఆడిస్తూ యువతులను పోలీసులు బెదిరించారు. దుస్తులు మార్చుకొని వస్తారా, లేక ఇలానే కొట్టుకుంటూ తీసుకెళ్లలా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. 

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉయ్యూరు పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే బెదిరింపులకు పాల్పడటంపై మండిపడుతున్నారు. నిందితులు, నేరస్థుల విషయంలోనూ బాధ్యతగా మెలగాల్సిన పోలీసులు ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
చదవండి: ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top