Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌.. ఒక్క క్లిక్‌తో..

Top 10 Telugu Latest Current News Headlines Today 7 April 2022 At 6 PM - Sakshi

ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. రాజీనామా చేసిన మంత్రులు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. 

మన గ్రహం, మన ఆరోగ్యం! అసలేంటి ఇదంతా?
ఏప్రిల్‌ 7..వరల్డ్‌ హెల్త్‌ డే ...‘‘అవర్‌ ప్లానెట్‌.. అవర్‌ హెల్త్‌’’. మన ఆరోగ్యంతో పాటు ఈ భూ గ్రహాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే  అనే విషయాన్ని  గుర్తుచేయడమే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లక్ష్యం. మానవాళి మనుగడకు పెను ముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ కాలుష్య నివారణపై  ప్రతీ పౌరుడు ఆలోచించడం చాలా అవసరం. ప్లాస్టిక్‌ని నిషేధం, సహజ అటవీ, నీటి వనరుల రక్షణ కీలకం. 

ఉక్రెయిన్‌ యుద్ధం.. తర్వాతి లక్ష్యం భారత్‌?
‘అమెరికా నేతృత్వంలో పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌ పరిణామాల్లో జోక్యం చేసుకుంటున్నాయి. రష్యాను నాశనం చేస్తేనే కానీ వాళ్లు శాంతించరు. అటుపై శక్తివంతమైన దేశం భారత్‌పై దృష్టి పెడతారు’
-డోనెస్క్‌ అధికార ప్రతినిధి ఎడువార్డ్‌ అలెక్సాండ్రోవిచ్‌ బసురిన్‌

ఇంత చేస్తున్నా.. ద్వేషించేవాళ్లను ఏం అంటాం?: సీఎం జగన్‌
రాష్ట్రంలో అవినీతిరహిత, పారదర్శకమైన పాలన అందిస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజాహితమైన తమ పాలనను ద్వేషించేవాళ్లను ఏమనాలో అర్థం కావట్లేదన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వలంటీర్ల సత్కార సభలో ఆయన ప్రతిపక్షాలు, ఎల్లో మీడియాపై విమర్శలు, చమక్కులు సంధించారు.

ఫుడ్‌ డెలివరీ ఏజెంట్‌గా టీసీఎస్‌ ఉద్యోగి.. ఆ తర్వాత ఏమైందంటే?
కంపెనీ మారే క్రమంలో వారం గ్యాప్‌ దొరికింది. ఖాళీగా కూర్చోవడం ఎందుకని జొమాటో ఫుడ్​ డెలివరీ ఏజెంట్‌గా పార్ట్‌ టైమ్‌ జాబ్‌ను ఎంచుకున్నాడు ఆ టీసీఎస్‌ ఉద్యోగి. అప్పుడు మొదలయ్యాయి ఆయన తిప్పులు. ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా చేయడం ఎంత కష్టమో వివరించారాయన. ఆయన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘డేంజరస్‌’ మూవీ విడుదల వాయిదా.. కారణమిదే అంటూ వర్మ ట్వీట్‌
రామ్‌ గోపాల్‌ వర్మ పాన్‌ ఇండియా చిత్రం ‘డేంజరస్‌’ విడుదల వాయిదా పడింది. ఏప్రిల్‌ 8 విడుదల కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా ఆర్జీవీ వెల్లడించారు. లెస్బియన్‌ నేపథ్యం కారణంగా చాలా థియేటర్లు సహకరించకపోవడంతో సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నామని ఆయన తెలిపారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్‌ క్రికెటర్‌..
దక్షిణాఫ్రికా స్టార్‌ మహిళా క్రికెటర్‌ మిగ్నాన్ డు ప్రీజ్ వన్డే, టెస్టు పార్మాట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించింది. తన కుటుంబంతో ఎ‍క్కువ సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డు ప్రీజ్ తెలిపింది. దక్షిణాఫ్రికా తరపున  అత్యధిక వన్డేలు ఆడిన  మహిళా క్రికెటర్‌ కూడా డు ప్రీజ్ కావడం విశేషం. ఆమె తన వన్డే కెరీర్‌లో 154 మ్యాచ్‌లు ఆడిన డు ప్రీజ్.. 3760 పరుగులు సాధించింది. తన కెరీర్‌లో 18 అర్ధ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. 

‘టాటా నీయూ’ యాప్‌ లాంచ్‌, రతన్‌ టాటా ప్లాన్‌ మామూలుగా లేదుగా!
ప్రముఖ టాటా గ్రూప్‌ దిగ్గజం ఐటీ, ఆటోమొబైల్‌, ఎవియేషన్‌ ఇలా అన్నీ రంగాల్లో సత్తా చాటుతోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రత్యర్ధులకు చెక్‌ పెడుతోంది. తాజాగా అమెజాన్‌, టెలికాం దిగ్గజం జియోలకు పోటీగా గురువారం 'టాటా నీయూ'పేరుతో యాప్‌ను విడుదల చేసింది. 

అమిత్‌ షాతో ఏం చర్చించానో బయటకు చెప్పలేను: గవర్నర్‌ తమిళిసై
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు మేలు జరిగేలా హోంమంత్రితో చర్చించానని అన్నారు. అయితే, ఆయనతో ఏం చర్చించానో బయటకు చెప్పలేనని అన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే ఎప్పుడూ ఆలోచిస్తున్నట్లు ఆమె చెప్పారు.  

ఆ లింక్స్‌లో మీ డీటెయిల్స్‌ ఇచ్చారంటే ఇక అంతే! ఊహించని రీతిలో నష్టం!
మెయిల్‌ ఓపెన్‌ చేయగానే కొన్ని స్పామ్‌ మెయిల్స్‌ మనకు కనిపిస్తాయి. డిస్కౌంట్‌ అనో, బ్యాంక్‌ సిబిల్‌ స్కోర్‌ ఫ్రీ అనో, మరేవో ఆఫర్లు అనో.. ఇ– మెయిల్స్‌ ఊరిస్తుంటాయి. వ్యాపార సందేశాలు దాదాపుగా స్పామ్‌ మెయిల్స్‌ను ఎంచుకుంటుంటాయి. వీటికి ఆకర్షితులై, ఆ లింక్స్‌లో మీ డీటెయిల్స్‌ ఇచ్చారంటే మిమ్మల్ని మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ. స్పామ్‌ మెయిల్స్‌తో మీరే స్కామ్‌లో ఇరుక్కోవచ్చు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top