టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

Today Morning News Headlines (20-1-2021) - Sakshi

అత్యధికులకు జీవనోపాధి
వైఎస్సార్‌ చేయూత కింద ఏర్పాటు చేస్తున్న రిటైల్‌ షాపులకు ప్రాముఖ్యత కల్పించడం చాలా అవసరం. ఈ పథకాలు ఏ మేరకు అమలవుతున్నాయో పరిశీలించాలి. మరింత పక్కాగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక అధ్యయనం చేయాలి. వీటి ద్వారా లబ్ధిదారుల జీవితాల్లో వచ్చిన మార్పులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలి. పూర్తి వివరాలు..

కోవాగ్జిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. 14రకాలు

కోవాగ్జిన్‌ కరోనా టీకాతో 14 రకాల సాధారణ సైడ్‌ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్‌కు చెందిన తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది. ఇవిగాక అరుదుగా మరో ఐదు రకాల సీరి యస్‌ రియాక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. టీకా తీసుకునే ముందు కేంద్రంలో ఉన్న వైద్య సిబ్బందికి లబ్ధిదారులు తమ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా వివరించాలని, పూర్తి వివరాలు..

శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదు

శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేశారు. దీనిపై పార్టీ ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నాలుగేళ్ల జైలుశిక్షను పూర్తిచేసుకుని ఈనెల 27న బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలవుతున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా జైలు వర్గాల నుంచి ఉత్తరం అందినట్లు శశికళ తరఫు న్యాయవాది మంగళవారం ప్రకటించారు. పూర్తి వివరాలు..

ముహూర్తం నేడే...

అంగరంగ వైభవంగా జరగాల్సిన అమెరికా అధ్యక్ష పదవీ ప్రమాణస్వీకార వేడుక యుద్ధ వాతావరణం మధ్యలో జరగనుంది. అగ్రరాజ్య చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా అధికార మార్పిడి తుపాకీ నీడలో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకవైపు కరోనా ఆంక్షలు, మరోవైపు ట్రంప్‌ మద్దతుదారుల నుంచి పొంచి ఉన్న ప్రమాదంతో జో బైడెన్‌ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలు..


విద్యార్ధినులపై వేధింపులు.. గురువుకు 49 ఏళ్ల జైలు శిక్ష

ఆరుగురు విద్యారి్థనులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడికి 49 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం కోర్టు తీర్పునిచ్చింది. వివరాలు... పుదుక్కోట్టై జిల్లా, గంధర్వకోట దువార్‌ గ్రామానికి చెందిన అన్బరసన్‌ (52) నరియన్‌పుదుపట్టి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ వచ్చాడు. విద్యారి్థనులు ఆరుగురిపై 2018లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతనిపై హెచ్‌ఎం జ్ఞానశేఖరన్‌ క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. పూర్తి వివరాలు..


ట్రెండ్‌ సెట్టింగ్‌ బుల్లోడు

ఒక్కో తరంలో ఒక్కో సినిమా ఉంటుంది. ఒక్కో యాక్టర్‌ కెరీర్‌ లో ఒక్కో సినిమా ఉంటుంది. కమర్షియల్‌ సినిమాలే అయినా... కాసులు కురిపించడంతో పాటు, పాపులర్‌ కల్చర్‌ పైనా ప్రభావం చూపెడతాయి. పేరు దగ్గర నుంచి పాటలు, దుస్తుల దాకా అనేక విషయాల్లో ఆ తరాన్నీ, ఆ తరువాతి సినిమాలనూ ప్రభావితం చేస్తాయి. అనేక తరాల పాటు గుర్తుండిపోతాయి. పూర్తి వివరాలు..

ఆసీస్‌ అడ్డాలో టీమిండియా కొత్త చరిత్ర

బ్రిస్బేన్‌కు రండి చూసుకుందాం... అవును వచ్చాం, అయితే ఏంటి? ‘గాబా’ మైదానంలో ఆడేందుకు భయపడుతున్నారు... మా పోరాటం సిడ్నీలోనే చూపించాం, మాకు భయమేంటి? మీరు పరుగులు చేయడం కష్టం... ఏమీ లేదు, మీతో సమానంగా పరుగులు సాధించాం చూడండి... ఇలాంటి బౌలింగ్‌తో మమ్మల్ని ఆలౌట్‌ చేయలేరు... చూశారా, మొత్తం 20 వికెట్లు పడగొట్టగలిగాం. మేం 32 ఏళ్లుగా ఇక్కడ ఓడలేదు...పూర్తి వివరాలు..​​​​​​​

వాట్సాప్‌కు కేంద్రం గట్టి హెచ్చరిక

ప్రైవసీ పాలసీలో మార్పులను ప్రతిపాదించిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తీరుపై కేంద్రం ఘాటుగా స్పందించింది. డేటా గోప్యత విధానంలో ఏకపక్షంగా మార్పులు చేయడం ఎంత మాత్రం సముచితం, ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రతిపాదిత మార్పులను ఉపసంహరించుకోవాలని సూచించింది. వాట్సా ప్‌ సీఈవో విల్‌ క్యాథ్‌కార్ట్‌కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ఈ మేరకు ఘాటుగా లేఖ పంపింది. పూర్తి వివరాలు..​​​​​​​

జనం మెచ్చిన రైతుబిడ్డ

సమస్య...కష్టం అనుకుంటే కష్టమే మిగులుతుంది. సమస్య....ఒక బడి అనుకుంటే పాఠం వినబడుతుంది. పరిష్కారం పది విధాలుగా కనిపిస్తుంది. పదిహేను సంవత్సరాల నేహా భట్‌ ఎకో–ఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్‌కు రూపకల్పన చేసి శభాష్‌ అనిపించుకుంది... పూర్తి వివరాలు..​​​​​​​
ప్రమాణ స్వీకారం సూట్‌లోనా? చీరలోనా?

ఇంకొద్ది గంటల్లో కమలా హ్యారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఆ ఆగ్రరాజ్యానికి వైస్‌–ప్రెసిడెంట్‌ అవుతున్న తొలి మహిళగా కమల ఈ చరిత్రాత్మకమైన కార్యక్రమానికి ఎలాంటి దుస్తులను ధరించి వస్తారు? అమెరికన్‌ పౌరురాలిగా అక్కడి సంస్కృతిని ప్రతిబింబించే ప్యాంట్‌ సూట్‌ను, బౌబ్లవుజును వేసుకుంటారా? లేక భారతీయ సంస్కృతిని ప్రతిఫలించే లా చీరకట్టుతో కనిపించబోతున్నారా? పూర్తి వివరాలు..​​​​​​​

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top