శ్రీకాళహస్తి అమ్మాయి జాక్‌పాట్.. రూ.40లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

శ్రీకాళహస్తి: ఓ సాధారణ ముస్లిం కుటుంబానికి చెందిన షేక్ షామిలి స్వయంకృషితో ఉన్నత స్థానానికి చేరారు. పట్టణానికి చెందిన రహంతుల్లా, సాజిద ద్వితీయ కుమార్తె షేక్షామిలి. చిన్నతనం నుంచే చదువలో దిట్ట. ఈమె శ్రీవిద్యానికేతన్‌లో బీటెక్ ఈసీ చదివారు.
తృతీయ సంవత్సరంలోనే ఆమెకు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చెన్నైలోని టీసీఎస్‌లో అవకాశం లభించింది. ఈ క్రమంలో ఈమె ప్రతిభను గుర్తించిన ‘వాల్‌మార్ట్’ ఆమెను సీనియర్ మేనేజరుగా నియమిస్తూ సోమవారం నియామకపత్రం పంపింది. సంవత్సరానికి రూ.40 లక్షలు వేతనం. ఈమెను పలువురు అభినందించారు.
చదవండి: (Snehakiran: పలాస అమ్మాయి జాక్‌పాట్.. రూ.44లక్షల ప్యాకేజీతో ఉద్యోగం)