కోవిడ్ సోకిందని గొంతుకోసుకున్నాడు!

కంచికచర్ల (నందిగామ): ఓ విశ్రాంత ఉద్యోగి కరోనా వచ్చిందని మనస్తాపం చెంది గొంతు కోసుకున్న ఘటన ఆదివారం కంచికచర్లలో జరిగింది. స్థానిక రంగానగర్‌లో నివాసముంటున్న విశ్రాంత ఉద్యోగి జొన్నలగడ్డ నారాయణ (65) ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా వైద్య పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బ్లేడుతో గొంతు కోసుకున్నారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆయనను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.