మరో యువతితో ఎఫైర్‌.. భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న మిస్‌ వైజాగ్‌ | Sakshi
Sakshi News home page

మరో యువతితో ఎఫైర్‌.. భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న మిస్‌ వైజాగ్‌

Published Thu, May 30 2024 6:37 PM

Miss Vizag Nakshatra Caught Her Husband With Another woman

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో మిస్‌ వైజాగ్‌ నక్షత్ర తన భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్తతపాటు తన కాపురంలో చిచ్చుపెట్టిన సదరు యువతిని చితకబాదింది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయితో కలిసి ఉంటున్నాడని ఆరోపించింది.  తన భర్త తనకే కావాలంటూ  నక్షత్ర ఆందోళనకు  దిగింది.

వివరాలు.. నక్షత్ర 2012లో మిస్‌ వైజాగ్‌గా ఎంపికైంది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగాత్రిపురనేని సాయి వెంకట తేజ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత 2017లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే పెళ్లయిన  కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే మరో అమ్మాయితో తేజ సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆమెను పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టాడు.

ఈ విషయం తెలుసుకున్న నక్షత్ర గురువారం ఉదయం.. విశాఖలోని దసపల్లా హిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తన భర్త ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లింది. అక్కడ వేరే అమ్మాయితో తన భర్త ఉండటాన్ని గుర్తించింది. పరాయి అమ్మాయితో తన భర్త ఉండటాన్ని చూసి తట్టుకోలేని నక్షత్ర ఆ అమ్మాయిపై దాడికి దిగింది. భర్త చెంప కూడా చెళ్లుమనిపించింది. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు కూడా వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఫ్లాట్‌లో ఉన్న అమ్మాయిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు కుమార్తెతో కలిసి నిరసనకు దిగింది. ఈ క్రమంలో నక్షత్ర.. తన భర్త గురించి అనేక విషయాలను బయటపెట్టింది. పబ్‌జీ గేమ్‌ ఆడి చాలామంది అమ్మాయిలను తేజ ట్రాప్‌ చేశాడని ఆరోపించింది. ఆయన అందంగా ఉండటంతో చాలామంది అమ్మాయిలు తనతో శారీరక సంబంధాల కోసం ఇష్టపడుతున్నారని తనకే చెప్పాడని పేర్కొంది. తనకు రోజుకో అమ్మాయి కావాలని ఒత్తిడి తీసుకొచ్చేవాడని ఆరోపించింది.

మరోవైపు తనపై నక్షత్ర తప్పుడు కేసులు పెట్టిందని ఆమె భర్త తేజ ఆరోపిస్తున్నాడు. కేసు కోర్టులో ఉందని.. అక్కడే తేల్చుకుంటానని తెలిపాడు. తనతో ఉన్న అమ్మాయి ఆడిషన్స్‌ కోసమే వచ్చిందని చెప్పాడు. 

Advertisement
 
Advertisement
 
Advertisement