June 24: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటలు | Huge Devotees Rush At Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటలు

Published Mon, Jun 24 2024 8:17 AM | Last Updated on Mon, Jun 24 2024 9:25 AM

Huge Devotees Rush At Tirumala

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 81,465  మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,251   మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67   కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 6 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

జూన్ 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

సెప్టెంబర్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

జూన్ 27న శ్రీవారి సేవ కోటా విడుదల

జూన్ 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement