మీ గెలుపు మాకు సంతోషం

CM YS Jagan Mohan Reddy Wishes To Kamala Harris - Sakshi

కమలా హ్యారిస్‌కు సీఎం జగన్‌ అభినందనలు

సాక్షి, అమరావతి: అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలుపొందిన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్‌ చేశారు. ‘డెమొక్రాట్లు గానీ, రిపబ్లికన్లు గానీ.. ఏ రాజకీయాలైతేనేం.. భారత సంతతికి చెందిన మీరు(కమలా హ్యారిస్‌) అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలుపొందడం మాకు గర్వంగా, సంతోషంగా ఉంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడంతో పాటు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top