కోవిడ్‌పై ఆందోళనలు వద్దు

AP Health Department clarification On Covid-19 - Sakshi

అత్యధిక కేసులు ఇళ్లలోనే నయమవుతున్నాయి 

ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, బెడ్లు అందుబాటులో ఉన్నాయి

రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులపై ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆ శాఖ ప్రకటించింది. వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను దూరం చేయాలని, వ్యాధి సోకి ఆస్పత్రులకు వచ్చే వారికి అరగంటలోనే బెడ్లు కేటాయించాలన్న సీఎం జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సర్వం సిద్ధమైంది. కరోనా సోకిన వారికి ఎక్కడా, ఏ లోటు లేకుండా వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేసింది.  

ఇళ్లలోనే 85 శాతం కేసులు 
► రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 85 శాతం మందికి ఇళ్లలోనే నయమవుతుంది. మిగిలిన 15 శాతం ఆస్పత్రుల్లో చేరినా, వారిలో కేవలం 4 శాతం రోగులు మాత్రమే అత్యవసర వైద్య సేవల విభాగం (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 11 శాతం మంది సాధారణ చికిత్సతో డిశ్చార్జ్‌ అవుతున్నారు. 
► రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులలో 36,778 బెడ్లు అందుబాటులో ఉండగా, వాటిలో గురువారం నాటికి కేవలం 45.48 శాతం అంటే.. 14,450 బెడ్లు మాత్రమే ఆక్యుపెన్సీలో ఉన్నాయి.  

ఆక్సిజన్‌ పైప్‌లైన్లు
► కోవిడ్‌ చికిత్సలో కీలకమైన ఆక్సిజన్‌ సరఫరాకు అవసరమైన పైప్‌లైన్ల ఏర్పాటుపైనా వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తికి ముందు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో 3,286 ఆక్సిజన్‌ పైప్‌లైన్లు అందుబాటులో ఉండగా, ఆ తర్వాత నుంచి ప్రభుత్వం వాటి సంఖ్యను గణనీయంగా పెంచుతోంది.  ఈ ఏడాది జూన్‌ 3వ తేదీ నాటికి 11,364 కొత్త ఆక్సిజన్‌ పైప్‌లైన్లు మంజూరు చేయగా, వాటిలో 10,425 పైప్‌లైన్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జూలై 29న మరో 7,187 ఆక్సిజన్‌ పైప్‌లైన్లను మంజూరు చేశారు. ఆ విధంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో 17,827, ప్రైవేటు ఆస్పత్రులలో 11,084 పైప్‌లైన్లు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28,911 ఆక్సిజన్‌ పైప్‌లైన్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

బెడ్ల సమాచారం: (30వ తేదీ గురువారం నాటికి) 
కోవిడ్‌ చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రులు – 138 
అందుబాటులో ఉన్న బెడ్లు – 36,778 
ఆస్పత్రుల్లో ఉన్న రోగుల సంఖ్య 14,450 
బెడ్ల వినియోగం– 45.48 శాతం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

04-08-2020
Aug 04, 2020, 03:38 IST
న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి....
04-08-2020
Aug 04, 2020, 02:27 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో గడప దాటాలన్నా, బహిరంగ మార్కెట్లకు వెళ్లి కూరగాయలు కొనాలన్నా జనం జంకుతున్నారు....
04-08-2020
Aug 04, 2020, 02:10 IST
లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌) : నిజామ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)లో కోవాక్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా కొనసాగుతున్నాయి. మొదటి దశ...
04-08-2020
Aug 04, 2020, 01:46 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా సామాజిక వ్యాప్తి జరగడం, గ్రామా ల్లోనూ వైరస్‌ ఘంటికలు మోగడంతో సర్కారు అప్రమత్తమైంది. దీంతో...
03-08-2020
Aug 03, 2020, 23:45 IST
ఒక సమస్య ఎదురైంది... అంటే, ఆ సమస్యకు పరిష్కారం కూడా తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఆ పరిష్కారం ఎక్కడ ఉందోననే...
03-08-2020
Aug 03, 2020, 17:56 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తనకు కరోనా సోకినట్లు ఆదివారం సాయంత్రం ట్వీట్‌ చేసిన...
03-08-2020
Aug 03, 2020, 16:55 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ఎవరిని వదిలి పెట్టడం లేదు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ...
03-08-2020
Aug 03, 2020, 16:41 IST
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దాంతో యోగా సెంటర్లు, జిమ్‌లు మూతపడ్డాయి. అయితే...
03-08-2020
Aug 03, 2020, 15:46 IST
సాక్షి, కరీంనగర్‌, సిరిసిల్లా: టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ప్లాస్మా దానం చేయడానికి‌ ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ...
03-08-2020
Aug 03, 2020, 15:23 IST
తాను వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు ఛాతిలో భయంకరపైన నొప్పితో బాధ పడ్డానని, తాను బతుకుతానని ఏ కోశానా నమ్మకం కలగలేదని ఆమె స్థానిక మీడియాకు...
03-08-2020
Aug 03, 2020, 15:04 IST
ఇప్పటివరకు కోవిడ్‌ బాధితుల ఫోన్‌ నెంబర్లు మాత్రమే రిజిస్టర్‌ చేస్తున్నారని, బాధితుడు మృతి చెందిన సందర్భాల్లో వారి కుటుంబాలకు సమాచారం అందడంలేదని తెలిపారు.
03-08-2020
Aug 03, 2020, 13:39 IST
లబ్బీపేట(విజయవాడతూర్పు): కోవిడ్‌–19 స్టేట్‌ హాస్పటల్‌లో  నాల్గవ తరగతి సిబ్బంది కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రోగుల వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లు, డబ్బులు...
03-08-2020
Aug 03, 2020, 13:10 IST
ఎల్లారెడ్డిరూరల్‌(ఎల్లారెడ్డి): కరోనాతో ఉపాధి లేక ఓ వ్యక్తి ఆకలితో మృతి చెందిన సంఘటన పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు...
03-08-2020
Aug 03, 2020, 12:48 IST
రాజానగరం (తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ కోవిడ్‌ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్‌ సోకిన రిమాండ్‌ ఖైదీ...
03-08-2020
Aug 03, 2020, 12:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ఊరటనిచ్చే ఒక శుభపరిణామం చోటు చేసుకుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిడ్-19...
03-08-2020
Aug 03, 2020, 11:07 IST
కరోనా లక్షణాలు.. అనుమానం ఉన్న వారు కోవిడ్‌ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్తే ఇక్కట్లు తప్పడంలేదు. నిన్ను ఎవరు పంపితే...
03-08-2020
Aug 03, 2020, 10:32 IST
బెంగళూరు: ప్రముఖులపై మహమ్మారి కరోనా పంజా విసురుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్పకు ఆదివారం కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.....
03-08-2020
Aug 03, 2020, 10:01 IST
న్యూఢిల్లీ: దేశం‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 18 లక్షలు దాటింది. తాజాగా గడిచిన 24...
03-08-2020
Aug 03, 2020, 09:52 IST
సేవచేయాలనే సంకల్పం ఉన్నవారికి హద్దులు అంటూ ఏవీ ఉండవు.ఎక్కడినుంచైనా ఎక్కడికైనా వారు ఆపన్న హస్తాన్ని అందిస్తారు. సమాజసేవ కోసం మేము...
03-08-2020
Aug 03, 2020, 09:19 IST
సాక్షి, సిటీబ్యూరో: జనావాసాల మధ్యన కోవిడ్‌ వ్యర్థాలను నిర్లక్ష్యంగా తరలిస్తున్న ఓ ఆస్పత్రి నిర్వాకంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బంజారాహిల్స్‌ ప్రాంతంలో అత్యంత...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top