‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ను విజయవంతం చేయాలి

AP Governor Biswa Bhusan Harichandan Says Every Citizen Participate In Azadi ka Amrut Mahotsav - Sakshi

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

సాక్షి, అమరావతి : భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు అవుతున్న శుభతరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’వేడుకలలో  పాల్గొని విజయవంతం చేయటం ప్రతి పౌరుని బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. 2022 ఆగస్టు 15కు 75 వారాల ముందస్తుగా మార్చి 12న 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' ప్రారంభించబడిందని గవర్నర్  పేర్కొన్నారు.

1930 లో మహాత్మా గాంధీ నేతృత్వంలోని చారిత్రాత్మక ఉప్పు సత్యాగ్రహ దండి యాత్ర ప్రారంభమైందని దాని  91 వ వార్షికోత్సవం కూడా ఈ సంవత్సరమేనని గుర్తు చేసారు. స్వాతంత్ర్య పోరాటం, ఉద్యమం అనే అంశంపై ప్రదర్శనలు, పోటీలు, విద్యార్థుల ర్యాలీలు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థి సంఘాలు చురుకుగా కార్యక్రమాలలో పాల్గొని 75 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గుర్తు చేసుకోవాలన్నారు. ఏడాది పొడవునా జరిగే ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులను, వారి కుటుంబ సభ్యులను సత్కరించాలని గవర్నర్ శ్రీ హరిచందన్ పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top