ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం శుక్రవారం ప్రారంభమయ్యింది. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఉచిత పంటల బీమా పథకం అమలు, ఇళ్లపట్టాల నిర్మాణం, గృహనిర్మాణ పథకాలపై కూడా కేబినెట్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల డీఏ బకాయిల చెల్లింపునకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే రాష్ట్రంలో నివర్ తుపాను ప్రభావం మీద అధికారులు కేబినెట్‌కు వివరించనున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి