గిరిజనులపై దాడులు అరికట్టాలి
● పోలీసు గ్రీవెన్స్‌లో గిరిజన,
వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదు
అనంతపురం సెంట్రల్: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్టీలపై దాడులు తీవ్రమయ్యాయని, ఎస్టీలకు రక్షణ కల్పించాలని వెఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు నాయక్, గిరిజన ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జగదీష్‌ను కలిసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ఉరవకొండ నియోజకవర్గం లత్తవరం తండాకు చెందిన వెంకటేష్ నాయక్‌పై టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ బోదపాటి గోవిందప్ప అనవసరంగా కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడన్నారు. ఘటనపై ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఇప్పటికై నా గోవిందప్పపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్ష పడేలా చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందునాయక్, లత్తవరం తండా సర్పంచ్ నాగరాజు నాయక్, నాయకులు ప్రసాద్‌నాయక్, ఆంజనేయులు నాయక్, సుంక నాయక్, లక్ష్మణ నాయక్, వీరస్వామి నాయక్, కాశీనాయక్, వార్డు మెంబర్ కుమారస్వామి నాయక్, ఆదిత్య లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
టూటౌన్ సీఐ శ్రీకాంత్‌యాదవ్‌పై
చర్యలు తీసుకోవాలి
సర్వజనాస్పత్రి ఎదుట అంబులెన్స్ డ్రైవర్లను బెదిరిస్తున్న అనంతపురం టూటౌన్ సీఐ శ్రీకాంత్‌యాదవ్ చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. సీఐ తీరును నిరసిస్తూ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట నుంచి ఎస్పీ కార్యాలయం వరకూ సోమవారం ర్యాలీ నిర్వహించి, గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ అంబులెన్స్ డ్రైవర్లను విచారణ పేరుతో పోలీసు స్టేషన్‌కు పిలిపించి సీఐ శ్రీకాంత్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ తీరు ఇలాగే కొనసాగితే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌గౌడ్, నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు, నగర అధ్యక్షుడు చిరంజీవి, నాయకులు పాల్గొన్నారు.


