పైళ్లెన నెల రోజులకే ఆత్మహత్య
యాడికి: ఏడడుగుల బంధం.. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో గడపాల్సిన యువకుడికి ఏకష్టమొచ్చిందో.. పైళ్లెన నెల రోజులకే విషపుగుళికలు మింగి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరూరులో శనివారం చోటు చేసుకుంది. వివరాలు..యాడికి మండలం నగరూరుకు చెందిన జయరాంనాయుడుకు శరత్ కుమార్ నాయుడు (23), లోకేష్ కమార్ నాయు డు అనే ఇద్దరు కుమారులు. శరత్‌కుమార్ నాయుడు మరో వ్యక్తితో కలిసి కొంతకాలంగా బెంగళూరులో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు లోకేష్ కుమార్ నాయుడు నగరూరులో వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. గత నెల 2,3వ తేదీన బళ్లారి జిల్లాకు సమీపంలోని సుగ్నీల్ కొట్టాలకు చెందిన సుస్మితతో శరత్‌కుమార్‌నాయుడుకు వివాహమైంది. 10 రోజుల క్రితం భార్య సుస్మితను నగరూరులో ఇంటి వద్ద ఉంచి బెంగళూరుకు వెళ్లాడు. ఈనెల 3న సుస్మిత పుట్టింటికి వెళ్లింది. శుక్రవారం బెంగుళూరు నుంచి వచ్చిన శరత్‌కుమార్ తాడిపత్రి మీదుగా నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న తన స్నేహితుడు హరీష్ ఇంటికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో హరీష్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లిన తర్వాత ఇంటిలో ఉన్న శరత్ కుమార్ నాయుడు తన సెల్‌ఫోన్‌తో భార్యతో గంటపాటు మాట్లాడాడు. ఆ తర్వాత విషపు గుళికలు మింగానని మిత్రుడు హరీష్‌కు ఫోన్‌లో తెలిపాడు. వెంటనే రూముకు వచ్చిన హరీష్ అతనికి తాడిపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన చికిత్సకోసం అనంతపురం తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన శరత్‌కుమార్‌నాయుడును కుటుంబ సభ్యులు చూసి కన్నీటి పర్యంత మయ్యారు.


