ఊపందుకున్న ఉద్యమం
8లో
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
అనంతపురం: ప్రజలకు మెరుగైన వైద్యం, పేదలకు వైద్య విద్య కల అందకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది. నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్వహించలేమంటూ పీపీపీ విధానం పేరిట ప్రైవేటీకరణకు చర్యలు చేపట్టింది. ప్రజల క్షేమాన్ని పక్కనపెట్టి తమ అనుయాయులకు లబ్ధి చేకూర్చడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. వైద్య కళాశాలలను పరిరక్షించుకోవాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగేలా చూడాలని ‘కోటి సంతకాల సేకరణ’ ప్రజా ఉద్యమం నిర్వహిస్తోంది. ఊరూవాడా సాగుతున్న ప్రజా ఉద్యమంలో పార్టీలకతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు భాగస్వాములయ్యారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేస్తున్నారు.
నాడు విప్లవాత్మక సంస్కరణలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ఉండగా, 2019లో ఒకేసారి 17 కొత్త వైద్య కళాశాలలు తీసుకొచ్చింది. ఇందులో ఐదు వైద్య కళాశాలలను 2023–24లోనే ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మన విద్యార్థులకు అదనంగా సమకూర్చారు. ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా బలోపేతం చేశారు. మిగిలిన కళాశాలల ఏర్పాటు వివిధ దశల్లో ఉంది.
నేడు వైద్య కళాశాలలకు చంద్రగ్రహణం
చంద్రబాబు సర్కారు కొలువుదీరాక వైద్యరంగం నిర్వీర్యమైంది. పేద విద్యార్థుల డాక్టర్ కల చిదిమేసేలా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారు. క్రమేణా ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సర్కారు తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఉధృతంగా ప్రజా ఉద్యమం
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ– రచ్చబండ ప్రజా ఉద్యమం జిల్లా అంతటా ఉధృతంగా సాగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు పెడుతున్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరించరాదని, ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని, మెరుగైన వైద్యం, అందుబాటులో వైద్య విద్య కొనసాగించాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. అనంతపురం, రాప్తాడు, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవ కొండ నియోజకవర్గాల్లో 2.80 లక్షల మంది ఇప్పటి దాకా సంతకాలు చేశారు. ముఖ్యంగా యువత, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. సింహభాగం సంతకాలు విద్యార్థులవే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం తమ భవిష్యత్తును పెత్తందార్లకు ఫణంగా పెట్టిందని విద్యార్థులు, యువత భావిస్తుండడమే ఇందుకు నిదర్శనం.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర
ప్రైవేటీకరణతో పేదలకు మెరుగైన వైద్యం, వైద్యవిద్య దూరం
సర్కారు తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
పార్టీలకతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తల భాగస్వామ్యం
ఊపందుకున్న ఉద్యమం


