జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. చ
భూసేకరణ వేగవంతం చేయండి
అనంతపురం అర్బన్: ఫీడర్ సోలరైజేషన్ పథకం కింద జిల్లాలో 498 ఏకరాల్లో 111 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు భూసేకరణను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. శనివారం సీఎస్ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ ప్రాజెక్టులు, ఇతర పథకాలపై ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ తోలేటి, కలెక్టర్ ఆనంద్, నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్‌బాబు, ఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్ అయూబ్‌ఖాన్, జాయింట్‌కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మతో కలిసి అధికారులతో సమీక్షించారు. అనంతపురం సర్కిల్ పరిధిలోని 20 ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియలో జాప్యం కాకూడదన్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో పీఎం కుసుమ్ పథకం కింద 610 మెగావాట్ల సామర్థ్యంతో 1.36 లక్షల వ్యవసాయ పంపుసెంట్లకు సోలార్ విద్యుత్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. పీఎం సూర్య ఘర్ కింద జిల్లాలో 35.7 మెగావాట్ల సామర్థ్యంతో 17,870 గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు.
బీఆర్ అంబేడ్కర్‌కు నివాళి
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్‌హాలులో ఆయన చిత్రపటానికి సీఎస్ విజయానంద్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఎస్పీడీసీఎల్ సీజీఎంలు రమణాదేవి, ఉమాపతి, జీఎం విజయన్, ఎస్‌ఈ శేషాద్రి శేఖర్, డీఆర్‌ఓ మలోల పాల్గొన్నారు.


