కోగటం ‘వీర’బాదుడు
అనంతపురం కార్పొరేషన్: అండర్ –19 కూచ్‌బెహార్ క్రికెట్ ట్రోఫీలో భాగంగా ఆర్డీటీ క్రికెట్ గ్రౌండ్‌లో కర్ణాటకతో సోమవారం జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు బ్యాటర్ కోగటం హనీష్ వీరారెడ్డి మెరుపు సెంచరీతో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 5 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. తొలుత టాస్ నెగ్గిన ఆంధ్ర జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోని ఓపెనర్ లోహిత్ లక్ష్మీనారాయణ 5 పరుగులు చేసి పెవిలిన్ బాట పట్టాడు. ఈ సమయంలో మరో ఓపెనర్ కోగటం హనీష్ వీరారెడ్డితో జతకట్టిన కేఎల్ శ్రీనివాస్ వికెట్ పడకుండా కర్ణాటక బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో కోగటం వీరారెడ్డి 163 బంతుల్లో 10 బౌండరీలు, 5 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. కెరియర్‌లో (అండర్–19) తొలి మ్యాచ్ ఆడుతున్న కేఎల్ శ్రీనివాస్ కూడా 225 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 98 పరుగులు సాధించి పెవిలియన్ బాట పట్టాడు. ఆటముగిసే సమయానికి పరమ్‌వీర్ సింగ్ 24, ఏఎన్‌వీ లోహిత్ 41 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కర్ణాటక బౌలర్లలో ధ్యాన్ 3, రతన్ 2 వికెట్లు పడగొట్టారు.
ఆంధ్ర స్కోర్ 300/5
కోగటం ‘వీర’బాదుడు


