మంచి సంస్కృతి కాదు
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. దీన్ని చూసి ప్రభుత్వం కనువిప్పు తెచ్చుకోవాలి గానీ ఇలాంటి పద్ధతి మంచిదికాదు. మా పార్టీకి చెందిన యువ నాయకులను భయభ్రాంతులకు గురిచేయడం తగదు. ఇది మంచి సంస్కృతి కాదు. అనంతపురంలో గతంలో ఎన్నడూ ఇలాంటి సంప్రదాయం లేదు. కొత్తగా మొదలుపెట్టారు. మేమూ దీటుగా బదులిస్తాం. ఏ ఒక్క వైఎస్సార్‌సీపీ నాయకుడికి, కార్యకర్తకు అన్యాయం జరిగినా సహించేది లేదు.
– అనంత వెంకట రామిరెడ్డి,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు


