●అధినేతతో భేటీ
రాప్తాడు రూరల్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అంశాలను ఈ సందర్భంగా అధినేత ఎదుట ప్రస్తావించారు.
జాతీయస్థాయి
ఖోఖో పోటీలకు ఎంపిక
కణేకల్లు: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు కణేకల్లు ఏపీమోడల్ స్కూల్ ఇంటర్ సెకెండియర్ విద్యార్థిని కె.స్వప్న ఎంపికై ంది. ఈ మేరకు ప్రిన్సిపాల్ రెహనబేగం, పీడీ రమేష్ గురువారం వెల్లడించారు. రెండ్రోజుల క్రితం విజయనగరంలో జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో స్వప్న ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించిందని పేర్కొన్నారు.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
● 13 ఏళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర నేరస్తుడు
అనంతపురం సెంట్రల్: ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని గుల్బర్గా (కలబురిగి)లోనూ దాదాపు 40కి పైగా కేసులున్న షికారి అనూసింగ్ ఎట్టకేలకు అనంతపురం మూడో పట్టణ పోలీసుల చేతికి చిక్కాడు. వివరాలు.. 15 ఏళ్ల క్రితం అనూసింగ్ పేరు వింటే జిల్లా పోలీసులు హడలిపోయేవారు. దొంగతనాలు, దోపిడీలు చేసే సమయంలో ఎవరైనా తారసపడితే హత్య చేయడానికి కూడా వెనుకాడేవాడు కాదు. 13 ఏళ్ల క్రితం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో దొంగతనానికి పాల్పడుతుండగా పోలీసులు తారసపడడంతో కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. దోపిడీకి పాల్పడిన కేసులో పదేళ్ల జైలు శిక్ష కూడా ఖరారైంది. అయితే అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌లూ ఉన్నాయి. గుంతకల్లు పట్టణానికి చెందిన అనూసింగ్‌కు నలుగురు భార్యలు కాగా, ఇటీవల వారిని కలిసేందుకు వచ్చినట్లుగా సమాచారం అందుకున్న అనంతపురం మూడో పట్టణ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలో దించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
దొంగకు దేహశుద్ధి
గుత్తి: స్థానిక కురుబ వీధి, బండగేరిలో దొంగతనానికి పాల్పడిన ఓ యువకుడిని స్థానిక యువకులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. వివరాలు.. బుధవారం రాత్రి ఓ యువకుడు ఆయా కాలనీల్లోని ఐదు ఇళ్లలోకి చొరబడి ఐదు సెల్‌ఫోన్లు, నగదు అపహరించారు. బాధితుల నుంచి విషయం తెలుసుకున్న స్థానిక యువకులు గాలింపు చర్యలు చేపట్టి బండగేరికి వెళ్లే మార్గంలో బారే హిమామ్ సందులో అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని పట్టుకుని ఆరా తీశారు. అతని వద్ద సెల్‌ఫోన్లు, నగదు బయటపడడంతో దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. విచారణలో తనది వైజాగ్ అని ఒకసారి, విజయనగరం అని మరోసారి చెప్పసాగాడు. జాన్ అని ఒకసారి, రామ్ అని మరోసారి పేర్లు మార్చి చెప్పాడు. దీంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
●అధినేతతో భేటీ
●అధినేతతో భేటీ


