పీఏబీఆర్‌కు తగ్గిన ఇన్‌ఫ్లో
కూడేరు: పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు ఇన్‌ఫ్లో తగ్గింది. శుక్రవారం నాటికి రిజర్వాయర్‌లో 5.27 టీఎంసీలకు నీటి మట్టం చేరింది. హెచ్చెల్సీ ద్వారా 150, జీడిపల్లి జలాశయం నుంచి 160 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జలవిద్యుత్ ఉత్పత్తికి 985 క్యూసెక్కులు, తాగునీటి ప్రాజెక్టులకు 55 క్యూసెక్కులు, ధర్మవరం కుడికాలువకు లీకేజీ రూపంలో 35 క్యూసెక్కులు, నీటి ఆవిరి రూపంలో 25 క్యూసెక్కుల చొప్పున అవుట్‌ఫ్లో ఉంది. నీటి మట్టం తగ్గడంతో 6వ గేటును బంద్ చేసి, 4వ గేటు ద్వారా 630 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


