
తేనె కోసమెళ్లి..
అమరాపురం: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. వివరాలు.. అమరాపురంలోని గాడి దొడ్డయ్య ఇంటి సమీపంలో ఉన్న చింత చెట్టులో ఉన్న తుట్టె నుంచి తేనెను సేకరించేందుకు బుధవారం అదే గ్రామానికి చెందిన యువకులు తిప్పేస్వామి (35), గిరీష్ సిద్ధమయ్యారు. చెట్టు ఎక్కి తేనె తుట్టె వైపుగా సాగుతుండగా చెట్టు మధ్యలో నుంచి వెళ్లిన విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగలి షాక్‌కు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే తిప్పేస్వామి మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన గిరీష్‌కు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు.