
జిల్లా కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ
అనంతపురం: ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్‌ను నిరసిస్తూ అనంతపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా అశోక స్థూపం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లో న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్రాముడు, ఉపాధ్యక్షుడు ధర్మసింగ్ నాయక్, ట్రెజరర్ వెంకట రఘుకుమార్, సంయుక్త కార్యదర్శి జుబేర్, మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బడా నారాయణరెడ్డి, శ్రీకాంత్, భరత్ భూషణ్ రెడ్డి, అవ్వా సురేష్ తదితరులు మాట్లాడుతూ.. ట్రోలింగ్‌తో న్యాయ వ్యవస్థపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సైతం జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించనున్నట్లు తెలిపారు.