
హైరిస్క్ కేసులపై జాగ్రత్త వహించండి : డీఎంహెచ్‌ఓ
గార్లదిన్నె: హైరిస్క్ గర్భిణుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య సిబ్బందిని డీఎంహెచ్‌ఓ ఈ. భ్రమరాంబదేవి ఆదేశించారు. గార్లదిన్నె పీహెచ్‌సీని బుధవారం ఆమె తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. ప్రధాన మంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. హైరిస్క్ గర్భిణులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్ మంజుల, సీహెచ్‌ఓ లోక్‌నాథ్, హెల్త్ సూపర్‌వైజర్ నరసమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.