హిందూపురం: స్థానిక సత్యసాయి నగర్‌లో పాత కక్షల కారణంగా యువకుడు నూర్ మహమ్మద్ కత్తి పోట్లకు గురయ్యాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రాఖీబ్ అలియాస్ టోక్రా కత్తితో దాడి చేయడంతో ముఖం, గొంతుపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. కాగా, గతంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారని, కొంతకాలంగా విభేధాలతో కక్షలు పెంచుకున్నట్లు తెలిసింది. దాడి చేసిన అనంతరం రాఖీబ్ నేరుగా వన్‌టౌన్ పీఎస్‌కు చేరుకుని లొంగిపోయినట్లు సమాచారం.