
చెట్టు లేకుంటే అక్షరమే లేదు
● ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి
అనంతపురం కల్చరల్: మనిషి మనుగడకు జీవనాధారమైన చెట్టు లేకుంటే సాహిత్యానికి ఊతమైన అక్షరమే లేదని డాక్టర్ వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ శాంతినారాయణ అన్నారు. ద్విభాషా కవి జూటూరు షరీఫ్ రాసిన ‘చెట్టు’ వచన శతకాన్ని ఆదివారం అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్‌లో అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో వారు ఆవిష్కరించారు. ఉప్పరపాటి వెంకటేశులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ అంకే శ్రీనివాస్ పుస్తక సమీక్ష చేశారు. సీనియర్ కవులు తరిమెల అమరనాథరెడ్డి, డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, మురళీకృష్ణ, కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాయుడు, రియాజుద్దీన్, డాక్టర్ తన్నీరు నాగేంద్ర తదితరులు మాట్లాడుతూ.. షరీఫ్ విలక్షణ కవితా లక్షణాలను కొనియాడారు. గౌరవ అఽతిథిగా విచ్చేసిన రాచపాలెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. చెట్టు వంటి కవితా సంకలనాలు సమాజాన్ని చైతన్య పరుస్తాయని అన్నారు. అంతకు ముందు ప్రజాగాయకుడు దాసరి ఆదినారాయణ ఆలపించిన ఉద్దీపన గీతం ఆకట్టుకుంది. అనంతరం జూటూరు షరీఫ్‌కు సాహితీ సంస్థల నిర్వాహకులు చం.శాస్త్రి, జిరసం ప్రతినిధులు కొత్తపల్లి సురేష్, డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, ఒంటెద్దు రామలింగారెడ్డి, జెన్నే ఆనంద్, మహాబోధి కృష్ణమూర్తి, గోరా, సూర్యనారాయణరెడ్డి తదితరులు ఆత్మీయ సన్మానం చేశారు.
రైల్లో నుంచి జారి పడి ప్రయాణికుడి మృతి
గుత్తి/పెద్దవడుగూరు: స్థానిక జీఆర్‌పీ పరిధిలోని మిడుతూరు సమీపంలో ఆదివారం రైలు నుంచి జారి పడి ఓ గుర్తు తెలియని ప్రయాణికుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న గుత్తి జీఆర్‌పీ ఎస్‌ఐ నాగప్ప, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు గుత్తి రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ నాగప్ప కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
కనుల పండువగా ఆషాఢ ఏకాదశి
ప్రశాంతి నిలయం: సత్యసాయి భక్తుల నడుమ ప్రశాంతి నిలయంలో ఆషాఢ ఏకాదశి వేడుకలు కనుల పండువగా జరిగాయి. ఆదివారం ఉదయం మహారాష్ట్ర, గోవా సత్యసాయి భక్తులు సాయిని కీర్తిస్తూ దిండి పల్లకీని ఊరేగింపుగా మహాసమాధి చెంతకు తీసుకువచ్చారు. పొండురంగడు.. సత్యసాయిల అవతార లక్ష్యం ఒక్కటేన్న సందేశాన్నిస్తూ బాలవికాస్ చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. సనాతన భారత చరిత్రలో అనేకమంది సాధువులు మనిషిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన తీరును చక్కగా వివరించారు. సాయంత్రం మహారాష్ట్ర, గోవా బాలవికాస్ చిన్నారులు ‘వాల్యూస్ వర్సెస్ వాల్యూస్’ పేరుతో మనిషి నిత్య జీవితంలో విలువలు పాటించాల్సిన ఆవశ్యకతను, పురాణాల ఆధారంగా విలువల ప్రాముఖ్యతను వివరిస్తూ చక్కటి ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.

చెట్టు లేకుంటే అక్షరమే లేదు

చెట్టు లేకుంటే అక్షరమే లేదు

చెట్టు లేకుంటే అక్షరమే లేదు