వంచించడమే కాకుండా వేధింపులు.. | Sakshi
Sakshi News home page

వంచించడమే కాకుండా వేధింపులు..

Published Sat, Apr 20 2024 2:00 AM

తాడిపత్రి 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ కొత్తపల్లి మల్లికార్జున   - Sakshi

జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, తాడిపత్రి 30వ వార్డు కౌన్సిలర్‌ కొత్తపల్లి మల్లికార్జున ఓ యువతిని వాడుకుని తల్లిని చేసి మొహం చాటేశాడు. పట్టణానికి చెందిన ఓ యువతితో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. వివాహం చేసుకుంటానని నమ్మబలికి ఆమెతో సహజీవనం చేశాడు. యువతి గర్భం దాల్చగా.. మాయ మాటలు చెప్పి అబార్షన్‌ చేయించాడు. ఈ క్రమంలోనే మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై బాధితురాలు నిలదీస్తే ఆమైపె దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు మల్లిఖార్జునపై కేసు నమోదు చేశారు. అయితే, బాధితురాలే తనను వేధిస్తోందంటూ కీచక కౌన్సిలర్‌ మల్లికార్జున ఆ అభాగ్యురాలిపై తన తల్లి ద్వారా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement