మహిళ బలవన్మరణం | Sakshi
Sakshi News home page

మహిళ బలవన్మరణం

Published Sat, Apr 13 2024 12:20 AM

-

పరిగి: మండలంలోని మోదా గ్రామానికి చెందిన నరసమ్మ(35) ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలు... మోదా పంచాయతీ పరిధిలోని కోనాపురం గ్రామానికి చెందిన నరసమ్మకు మోదా గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణప్పతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణప్ప మృతి చెందాడు. గత మంగళవారం ఉగాది పండగ రోజున నరసమ్మ తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తల్లి ఆచూకీ కోంస బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో కుమారులు ఆరా తీశారు. ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మోదా గ్రామ చెరువులోని మరువ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని విగతజీవిగా వేలాడుతున్న మహిళను స్ధానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి కుళ్లిన స్థితిలో ఉండడంతో గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో మృతురాలి కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించి నరసమ్మగా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఆమె కుమారులు ఇద్దరూ అక్కడకు చేరుకుని మృతురాలిని తల్లి నరసమ్మగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు హెచ్‌సీ శ్రీనివాసులు తెలిపారు. కాగా, ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement