ఆటోను ఢీకొన్న కియా బస్సు | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న కియా బస్సు

Published Sat, Apr 13 2024 12:20 AM

ప్రమాదానికి కారణమైన కియా బస్సు   - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: ఆటోను కియా బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... పుట్టపర్తి మండలంలోని పలు గ్రామాలకు చెందిన మహిళలు గోరంట్ల మండలం గుంతపల్లి వద్ద నిషా గార్మెంట్స్‌ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకున్న వారు ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో పుట్టపర్తి మండలం పెడపల్లి సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి కియా పరిశ్రమకు కార్మికులను తరలిస్తున్న బస్సు వేగంగా వచ్చి ఢీకొని, అలాగే ముందుకు దూసుకెళ్లి పాలవ్యాన్‌ను తోసుకుంటూ వెళ్లి నిలిచిపోయింది. ఆటో డ్రైవర్‌ అంజినప్ప నాయక్‌తో పాటు మహిళా కార్మికులు లక్ష్మీదేవిబాయి, మణిబాయి, చాకలి రాధ, అనిత, శ్రీకన్య, విమలమ్మ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమై కియా బస్సు డ్రైవర్‌ రాకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement