ప్రమాదంలో ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో ఒకరి మృతి

Published Sat, Apr 13 2024 12:20 AM

మృతుడు 
హనుమంతరాయప్ప  - Sakshi

రొళ్ల: జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... రొళ్ల మండలం గిడ్డబొమ్మనహళ్లికి చెందిన హనుమంతరాయప్ప(62) శుక్రవారం పనిపై హుళికుంటకు వెళ్లి రాత్రికి కాలినడకన స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో రొళ్ల సమీపంలోని నిస్సత్‌ సెంట్‌ కర్మాగారం వెనుక జాతీయ రహదారి దాటుతుండగా అగళికి చెందిన ద్విచక్ర వాహనదారులు నరసింహప్ప, భూతన్న రొళ్ల వైపు వెళుతూ ఢీకొన్నారు. ఘటనలో హనుమంతరాయప్ప అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన నరసింహప్ప, భూతన్న రోడ్డు పైపడి గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ ద్వారా అగళి పీహెచ్‌సీకి తరలించారు. మృతుడికి భార్య భూతమ్మతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాసేపటి తర్వాత ద్విచక్ర వాహనంపై తల్లి భాగ్యమ్మతో కలసి వెళుతున్న అగళి మండలం రామనపల్లికి చెందిన మంజునాథ్‌... రోడ్డుపై పడి ఉన్న హనుమంతరాయప్ప మృతదేహాన్ని ఆఖరి క్షణంలో గమనించి తప్పించబోయి వాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. ఘటనలో భాగ్యమ్మ తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్‌ వాహనంలో ఆమెను రొళ్ల పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈరలక్కప్ప, మడకశిర అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ అనంతరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఘటనపై ఎస్‌ఐ రాజశేఖర్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

నలుగురికి తీవ్ర గాయాలు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement