రాప్తాడు జనసంద్రం | Sakshi
Sakshi News home page

రాప్తాడు జనసంద్రం

Published Tue, Dec 5 2023 5:20 AM

-

సామాజిక సాధికార బస్సు యాత్రకు రాప్తాడు నియోజకవర్గ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. మధ్యాహ్నం నుంచే రాప్తాడు కూడలి జనసంద్రంగా మారింది. బస్సు యాత్రలో ఎమ్మెల్సీ మంగమ్మ, మడకశిర, కదిరి, అనంతపురం ఎమ్మెల్యేలు డాక్టర్‌ తిప్పేస్వామి, డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, ఏడీసీసీ బ్యాంక్‌ చైర్‌పర్సన్‌ లిఖిత, అనంతపురం మేయర్‌ వసీం, అహుడా చైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌, రజక కార్పొరేషన్‌ చైర్మన్‌ మీసాల రంగన్న, వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్‌ పొగాకు రామచంద్ర, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీమ్‌ అహ్మద్‌, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జోనల్‌ ఇన్‌చార్జ్‌ రమేష్‌గౌడ్‌, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బస్సు యాత్ర విజయవంతంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్‌ కనిపించింది.

Advertisement
 
Advertisement