సొంతింటి కల నెరవేరింది | Sakshi
Sakshi News home page

సొంతింటి కల నెరవేరింది

Published Tue, Nov 28 2023 2:26 AM

- - Sakshi

మేము కొన్నేళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. సొంతింటి కోసం తెలుగుదేశం హయాంలో అర్జీలు పెట్టుకొని కాళ్లరిగేలా తిరిగాము. అయితే జగనన్న ప్రభుత్వంలో వలంటీర్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నాం. ఇళ్లు మంజూరైందని చల్లని తీపి కబులు చెప్పారు. పట్టా కూడా చేతికి ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నాం. దీంతో ఎన్నో ఏళ్ల మా సొంతింటి కల నెరవేరింది. మా లాంటి పేదలకు ప్రభుత్వమే సాయం చేసి చేదోడు వాదోడుగా నిలుస్తోంది.

– రామేశ్వరి, అచ్యుతాపురం,

యల్లనూరు మండలం

ఆరోగ్యశ్రీతోనే బతికి బయటపడ్డా

కూలి పనిచేస్తేనే మాకు పూట గడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు కడుపులో గడ్డలు ఉండి కడుపునొప్పి ఎక్కువగా ఉండేది. వైద్యుల వద్దకు వెళ్లగా కడుపులో గడ్డల వల్ల నీకు కడుపునొప్పి, నెలసరి ముట్టు వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పారు. నా సమస్య ఎలా పరిష్కరించుకోవాలా అని ఆలోచించా. అంతలోనే మా గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ఏర్పాటు చేశారు. అక్కడ వైద్యులను సంప్రదించిగా పరిష్కారం దొరికింది. అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేసి గడ్డలను తొలగించారు. పిల్లలు, భర్తతో సంతోషంగా ఉన్నాను. ఈ ఆరోగ్యశ్రీ నే మా ప్రాణం నిలబెట్టింది. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది.

– బండి పుల్లమ్మ ,బొప్పేపల్లి,

యల్లనూరు మండలం

ఇల్లు మంజూరైంది

మా ఊళ్లో ఇప్పటి వరకూ సొంతిల్లు లేని ప్రతి ఒక్కరికీ జగన్‌ ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించి ఇస్తోంది. నాకూ ఓ ఇల్లు మంజూరైంది. నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం అధికారుల చుట్టూ తిరిగినా అప్పట్లో మాకు న్యాయం చేకూరలేదు. జగన్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వలంటీర్‌ మా వద్దకు వచ్చి ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లి ఇంటి పట్టా తెచ్చిచ్చాడు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు అధికారులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. త్వరలో గృహ ప్రవేశం చేయబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.

– వెంకట్రాముడు, కొత్తపేట,

గుత్తి మండలం

ప్రాణం పోశారు

నేను, నా భర్త చండ్రాయుడు, ముగ్గురు పిల్లలు కలసి జీవిస్తున్నాం. కూలి పనులే జీవనాధారం. 2020లో నాకు తీవ్ర గుండెనొప్పి వచ్చింది. డాక్టర్‌ను సంప్రదిస్తే గుండె ఆపరేషన్‌ చేయాలన్నారు. విషయం తెలుసుకున్న ఆరోగ్యమిత్ర బాబు మా ఇంటి వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కర్నూలులోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించి రూ.1.50 లక్షలు విలువ చేసే శస్త్రచికిత్స చేయించారు. ఇందు కోసం నయాపైసా ఖర్చు కాలేదు. పైగా మందులు, ఇతర అవసరాలకు రూ.10వేలు ఇచ్చారు. ప్రస్తుతం నా ఆరోగ్యం కుదుట పడింది.కుట్టు పనితో రోజూ రూ.300 వరకూ సంపాదిస్తున్నా. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నాకు ప్రాణం పోసిన సీఎం వైఎస్‌ జగన్‌ మేలు మరువలేం.

– నాగమ్మ, నెహ్రూ కాలనీ, పామిడి

1/4

2/4

3/4

4/4

Advertisement
 
Advertisement