ప్రభుత్వ మేలు మరువలేం | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ మేలు మరువలేం

Published Sat, Nov 18 2023 9:06 AM

- - Sakshi

వృద్ధాశ్రమంలో ఉండే మాలాంటి వాళ్ల కోసం జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ఈ నెల 5వ తేదీన వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు చేసి మందులు ఉచితంగా ఇచ్చారు. కంటి పరీక్షలు చేయించుకోగా సమస్య ఉందని చెప్పారు. అక్కడి నుంచి ప్రభుత్వ సర్వజనాస్పత్రికి రెఫర్‌ చేశారు. వైద్యులు చూసి కళ్లద్దాలు అవసరమని చెప్పారు. ఇన్ని రోజులు దృష్టి లోపం ఉన్నట్లు తెలియలేదు. మాలాంటి వారిని వెతుక్కుంటూ వచ్చి వైద్యం చేయించుకోండని ఎవరు చెబుతారయ్యా.. నా జీవితంలో ఇటువంటి సేవలను చూడలేదు. ప్రభుత్వం మాకు చేసిన ఈ మేలును మరువలేం.

– సుజాత, ఆర్యవైశ్య వృద్ధాశ్రమం,

అనంతపురం

ప్రతి పేషెంటుకూ మెరుగైన చికిత్స

జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా గుర్తించిన ప్రతి పేషెంటుకూ మెరుగైన చికిత్స చేయాలనేది లక్ష్యం. పెద్ద జబ్బులైతే రెఫరల్‌ ఆస్పత్రులకు పంపించి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తున్నాం. వైద్య పరీక్షలు మొదలుకొని, మందుల వరకూ అన్నీ ఉచితంగానే. ఈ క్యాంపుల ద్వారా ఎంతోమంది పేదలకు లబ్ధి జరుగుతోంది.

–గౌతమి, కలెక్టర్‌, అనంతపురం

1/2

2/2

Advertisement
 
Advertisement