ప్రతిష్టాత్మకంగా కుల గణన | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మకంగా కుల గణన

Published Sat, Nov 18 2023 9:06 AM

- - Sakshi

అనంతపురం అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కుల గణన–2023 జిల్లాస్థాయి సదస్సులో కలెక్టర్‌ మాట్లాడారు. ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన జీవనోపాధి, జనాభా సమతుల్యత అంశాలపై కుల గణన ఉంటుందన్నారు. అణగారిన వర్గాల మరింత అభ్యున్యతికి ఈ గణాంకాలు ఉపకరిస్తాయన్నారు. ఈ నెల 27 నుంచి వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుల గణన సర్వే నిర్వహిస్తారన్నారు. సర్వేపై విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావలన్నారు. ఒక్క కుటుంబాన్నీ వదలకుండా సర్వే చేయాలన్నారు.

సాహసోపేత నిర్ణయం

కుల గణన చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అన్నారు. కుల గణనకు అన్ని సామాజిక వర్గాల వారు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. బహుజనులకు ఇంత ప్రాధాన్యత మన రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదన్నారు. 156 కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి గౌరవ ప్రదమైన స్థానం కల్పించారన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌, రజక కార్పొరేషన్‌ చైర్మన్‌ మీసాల రంగన్న, ఏడీసీసీబీ చైర్‌పర్సన్‌ లిఖిత, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ మేడా రామలక్ష్మి, జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ నాగరత్నమ్మ, ఆర్టీసీ జోనల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, రిటైర్డ జడ్జి కిష్టప్ప, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ హరీష్‌కుమార్‌ యాదవ్‌, జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ ఫయాజ్‌, సీపీఓ అశోక్‌కుమార్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మధుసూదన్‌రావు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement