
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ గర్హనీయం
● మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు
కె.కోటపాడు: సిట్ విచారణకు హాజరైన ఎంపీ మిథున్‌రెడ్డిపై దౌర్జన్యంగా కేసు బనాయించి అరెస్టుకు పాల్పడడం అన్యాయమని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తెలిపారు. ఈ మేరకు ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను ఆయన ఖండించారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు ఇటువంటి కుట్రలకు తెరతీసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తుందనడానికి మిథున్‌రెడ్డి అరెస్టే నిదర్శనమన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కక్షపూరితంగా అరెస్ట్ చేశారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేస్తున్నారన్నారు. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇటువంటి కుట్ర రాజకీయాలకు తెరతీశారని దుయ్యబట్టారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనల్లో జన సందోహాన్ని చూసి చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదన్నారు.