
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా ముగ్గురికి అవకాశం
విశాఖ సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్)గా అనకాపల్లి జిల్లాలో ముగ్గురికి అవకాశం దక్కింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలను చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటించింది. రాష్ట్ర కార్యదర్శులుగా దంతులూరి దిలీప్‌కుమార్ రాజు, పైలా శ్రీనివాసరావు, చిక్కాల రామారావు నియమితులయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను వీరికి కేటాయించనున్నట్లు కేంద్ర కార్యాలయం తెలిపింది. వీరు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకు సహాయకులుగా వ్యవహరిస్తారని పేర్కొంది.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా ముగ్గురికి అవకాశం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా ముగ్గురికి అవకాశం