
అక్రమంగా మట్టి తరలింపు
● పొక్లెయిన్, ట్రాక్టర్లు సీజ్
కోటవురట్ల : అక్రమంగా తరలిస్తున్న మట్టి ట్రాక్టర్లను పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇవి..పాత గొట్టివాడ ప్రాంతం నుంచి మట్టి తరలిపోతోందన్న విశ్వసనీయ సమాచారంతో ఆదివారం ఉదయం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక పొక్లయిన్, మూడు ట్రాక్టర్లు పట్టుబడగా వాటిని సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. మట్టి తరలింపునకు సంబంధించి రెవెన్యూ, మైనింగ్ శాఖాధికారుల నుంచి ఎటువంటి అనుమతి లేనట్టు గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం తహసీల్దారుకు సమాచారం ఇచ్చినట్టు ఎస్‌ఐ తెలిపారు.

అక్రమంగా మట్టి తరలింపు