
రాష్ట్రస్థాయి అండర్–16 ఫుట్‌బాల్ శిక్షణ తరగతులు ప్రార
తగరపువలస: చిట్టివలస బంతాట మైదానంలో రాష్ట్రస్థాయి అండర్–16 ఫుట్‌బాల్ బాలుర జట్టుకు ఆదివారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ సూచనల మేరకు, అనంతపురానికి చెందిన దాదా ఖలంధర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అక్కరమాని చినబాబు, ఉపాధ్యక్షుడు రాజారావు, కోల చంద్రశేఖర్ 10 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. శిక్షణ అనంతరం జట్టు ఈ నెల 26న మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో జరిగే ఆల్ ఇండియా అండర్–16 టోర్నమెంట్‌లో పాల్గొననుంది.