
‘కుబేర’ పైరసీ ప్రదర్శనపై ఫిర్యాదు
తగరపువలస: తాళ్లవలస తిరుమల విద్యాసంస్థల యాజమాన్యం చిట్టివలస క్యాంపస్ విద్యార్థుల కోసం ఆదివారం సాయంత్రం ‘కుబేర’సినిమాను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ చిత్రం తగరపువలసలోని తాతా థియేటర్‌లో ప్రదర్శించబడుతోంది. ఓటీటీలోకి ఇంకా విడుదల కాని ఈ సినిమాను క్యాంపస్ బయట, రోడ్డుపైనే రెండు స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రదర్శించడాన్ని థియేటర్ యాజమాని పరిమి గోపి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమల యాజమాన్యం పైరసీకి పాల్పడిందని ఆరోపిస్తూ.. తమ సిబ్బందిని పంపి సినిమా ప్రదర్శనను నిలిపివేయించారు. అనంతరం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన రెండు ప్రొజెక్టర్లు, రెండు స్క్రీన్లు, అలాగే పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు.