
ధర్మశ్రీకి కన్నబాబు ఆశీస్సులు
అచ్యుతాపురం: వైఎస్సార్ సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజును శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ధర్మశ్రీ నియామకాన్ని అధిష్టానం ప్రకటించిన తర్వాత ఆయన పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభించారు. ముందుగా కన్నబాబు స్వగృహానికి వెళ్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఒకరికొకరు శాలువాలు కప్పుకొని సత్కరించుకున్నారు. నిన్నటి వరకూ పార్టీ సమన్వయకర్తగా వ్యవహరించిన కన్నబాబును కలిసి ఆశీస్సులు తీసుకోవడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీని ఒకే తాటిపై తీసుకొచ్చేందుకు ఇటువంటి చర్యలు దోహదం చేస్తాయని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.