
ధర్మశ్రీకి అభినందనలు
ధర్మశ్రీని అభినందిస్తున్న అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ నాయకులు, జెడ్పీటీసీలు
చోడవరం: ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీని వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ధర్మశ్రీని పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ విశాఖలో శుక్రవారం అభినందించారు. రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కె.భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, అనకాపల్లి పార్లమెంటు పరిశీలకురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, జీసీసీ మాజీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, పలువురు జెడ్పీటీసీ సభ్యులు అభినందనలు తెలిపారు.