
పింఛనుదార్ల ఇబ్బందులు తొలగిస్తాం
● ఖజానా శాఖ రాష్ట్ర డైరెక్టర్ మోహన్‌రావు
అనకాపల్లి: జిల్లా ఖజానా శాఖా కార్యాలయాన్ని ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎన్.మోహన్‌రావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పే బిల్‌లో సీఎఫ్‌ఎంఎస్ ప్రతి మూడు నెలలకు పాస్‌వర్డ్ మార్పు చేయడం వలన పింఛనుదారులు ఇబ్బంది పడుతున్నారని, ఆరు మాసాలకు మార్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. కుటుంబ పింఛను పొందుతున్న వారిలో భార్య జనన తేదీ మార్పు విషయంలో ఇబ్బందులను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారుల సంఘం జిల్లా బ్రాంచి అధ్యక్షుడు వడ్డాది జగన్నాథరావు, కార్యదర్శి బి.ఎల్.ఎన్.శర్మలు శాలువాలతో ఎన్.మోహనరావును సత్కరించారు. జిల్లా ఖజానాధికారి వి.ఎల్.సుభాషిణి, సంఘం కోశాధికారి కె.సత్యారావు, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి కె.వి.గౌరీపతి తదితరులు పాల్గొన్నారు.