
తాళ్లపాలెం పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో తనిఖీ
రికార్డులు తనిఖీ చేస్తున్న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి హైమావతి
కశింకోట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధిక శాతం సంస్థాగత ప్రసవాలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఎం.హైమావతి ఆదేశించారు. మండలంలోని తాళ్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రం పని తీరును, రికార్డులు, నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు శత శాతం సాధించాలని వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. వైద్యాధికారి ఎస్. సుమ, డిప్యూటీ ఆరోగ్య విస్తరణాధికారి ఎం.ఎస్.వి. ప్రసాద్, సీసీ లక్ష్మీనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.