
ఇదేం మెహర్బానీ...!
పేరెంట్స్ మీటింగ్‌లో తన కుమారుడు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న హోంమంత్రి అనిత
మండల కేంద్రం నక్కపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో హోంమంత్రి అనిత కుమారుడు నిఖిల్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. కళాశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఇదే రోజు మంత్రి కొడుకు పుట్టినరోజు కావడంతో స్థానిక కూటమి నాయకులు మంత్రి మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇదే సమావేశం పక్కన ప్రత్యేకంగా పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేశారు. మంత్రి అనిత తన కొడుకుతో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమం చూసి పేరెంట్స్ ముక్కున వేలేసుకున్నారు. పేరెంట్స్ మీటింగ్‌కు అని పిలిచి మంత్రి కుమారుడి పుట్టినరోజు సంబరాలు నిర్వహించుకుంటారా..? అంటూ అసహనం వ్యక్తం చేశారు.